అక్షరటుడే, వెబ్‌డెస్క్ Actress Hema : ఒకప్పటి నటి హేమ Actress Hema తన నటనతో ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500పైగా చిత్రాల్లో నటించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. ఈమెది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు. సినిమాలపై ఉన్న ఆసక్తిగా ఇండస్ట్రీ వైపు వచ్చిన హేమ.. Serials సీరియల్స్‌లో కూడా నటించింది. 1989లో ‘చిన్నారి స్నేహం’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆమె చివరిగా 2023లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రంలో మెరిసింది. అయితే ఇటీవలి కాలంలో హేమ సినిమాల కన్నా కూడా వివదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది.
Actress Hema : ఎందుకు ఇలా…
కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని డ్రగ్, రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు రావడమే కాదు, ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చేసిన డ్రగ్స్ కేసులో తాను నిర్దోషిని అని చెప్పుకొచ్చింది. కాని అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. కొన్నాళ్ల క్రితం వరకు నటిగా బిజీగా గడిపిన హేమ గత 4, 5 ఏళ్లుగా మాత్రం సినిమాలు చేయడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ లో కనిపించిన హేమకు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది.
ఇకపై తాను సినిమాలు చేయనని చెప్పేసింది హేమ. ‘నేను సినిమాల్లో యాక్ట్ చేయడం మానేశాను. నేను ఇప్పుడు చిల్ అవుతున్నా. హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు 14 ఏళ్ల వయసు అప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఇక కష్టపడింది చాలు, ఎవరికోసం కష్టపడాలి? నేను నా కోసం హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు బోర్ కొట్టి మళ్లీ యాక్ట్ చేయాలని అనిపించినప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే శివగామి లాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయను. ఇంట్రస్ట్ లేదు’ అని చెప్పేసింది హేమ.