UPI transactions | యూపీఐ లావాదేవీల‌పై కేంద్రం గుడ్ న్యూస్..చిన్న వ్యాపారుల‌కి ఊర‌ట‌

UPI transactions | యూపీఐ లావాదేవీల‌పై కేంద్రం గుడ్ న్యూస్..చిన్న వ్యాపారుల‌కి ఊర‌ట‌
UPI transactions | యూపీఐ లావాదేవీల‌పై కేంద్రం గుడ్ న్యూస్..చిన్న వ్యాపారుల‌కి ఊర‌ట‌
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: UPI transactions | ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎంత‌గా పెరిగింది అంటే చిన్న వాటి నుండి పెద్ద వాటి వ‌ర‌కు డిజిట‌ల్ పేమెంట్స్ (Digital payments) చేస్తూ ఉన్నారు. గూగుల్‌పే, ఫోన్‌ పే, పేటీఎం తదితర యాప్స్‌ సహాయంతో డిజిటల్‌ పేమెంట్స్‌ (Digital payments) చేస్తున్నారు. తాజాగా నేషనల్‌ పేమెంట్స్‌(National Payments) కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ మార్గదర్శకాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకులు డిస్‌కనెక్ట్ చేసిన.. లేదంటే సరెండర్ చేసిన మొబైల్‌ నంబర్‌లను(mobile numbers) మార్చి 31 వరకు తొలగించాలని యాప్‌లను ఆదేశించింది. రూ.1500 కోట్ల ప్రోత్సాహ‌క ప‌థ‌కాన్ని 2024 ఏప్రిల్ 1 నుండి అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

UPI transactions | కేబినేట్ ఆమోదం..

చిన్న వ్యాపారుల‌ని(small businesses) డిజిట‌ల్ లావాదేవీల‌కి మ‌రింతగా ప్రోత్స‌హించేందుకు రూపొందించిన ఈ ప‌థ‌కం రూ.2 వేల లోపు ఉన్న యూపీఐ లావాదేవీల‌పై 0.15 శాతం ప్రోత్సాహ‌కాన్ని అంద‌జేస్తుంది. ఈ క్ర‌మంలో చిన్న వ్యాపారులు ఎలాంటి ట్రాన్సాక్ష‌న్ ఛార్జీల(transaction charges) భారాన్ని లేకుండా యూపీఐ(UPI) వాడుకోవ‌చ్చు. జీరో ఎండీఆర్ అమ‌ల్లో ఉన్నందున ఎలాంటి అద‌న‌పు ఖ‌ర్చులు పెట్టాల్సిన ప‌ని లేదు. ప్ర‌భుత్వ(government) అంచ‌నాల ప్ర‌కారం 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 8,839 కోట్ల డిజిట‌ల్ లావాదేవీలు జ‌రిగాయి. ఈ సంఖ్య 2023-2024 నాటికి 18,737 కోట్ల‌కి పెరిగింది.

2021-22లో 4,597 కోట్ల లావాదేవీలు జ‌ర‌గ‌గా, 2023-24 నాటికి 13,116 కోట్ల‌కి పెరిగాయి. ఈ వృద్ధిలో చిన్న వ్యాపారులు కీల‌క పాత్ర పోషించిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతుంది. ప్రోత్సాహ‌క నిధుల(funds) పంపిణీ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌గా, 80 శాతం నిధుల‌ని ప్ర‌తి త్రైమాసికానికి బ్యాంకు(bank)ల‌కి నేరుగా చెల్లిస్తారు. మిగిలిన 20 శాతం మొత్తాన్ని బ్యాంకుల సేవా ప్ర‌మాణాల‌ని బ‌ట్టి విడుద‌ల చేస్తారు. బ్యాంకు(bank)ల డిక్లైన్ రేట్ 0.75 శాతం క‌న్నా త‌క్కువ‌గా ఉంటే 10 శాతం అద‌న‌పు బోన‌స్, అలాగే సిస్ట‌మ్ అప్‌టైమ్ 99.5 శాతం కంటే ఎక్కువగా ఉంటే మ‌రో 10 శాతం బోన‌స్ అంద‌జేయ‌నున్నారు. పుల్ లావాదేవీ కారణంగా కస్టమర్ స్వయంగా తన UPI యాప్‌(APP)లో మొత్తాన్ని ఎంటర్ చేయకుండానే చెల్లింపు ఆమోదం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో పుల్ లావాదేవీల కారణంగా డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ విధానం మోసపూరిత లావాదేవీలను పెంచే ప్రమాదం కలిగిస్తుందని అంటున్నారు.

Advertisement