Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Indur Tirumala |మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో కొలువైన ఇందూరు తిరుమలలో(Narsingpalli indur tirumala) బ్రహ్మోత్సవాలను(Brahmostavalu) వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 20 నుంచి 26 వరకు త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి సూచనలతో దేవనాథ రామానుజ స్వామి, గంగోత్రి ఆచార్య రామానుజదాసు స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, దిల్‌రాజ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Indur Tirumala | ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు
- ఈ నెల 20న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
- 21న ఉదయం ధ్వజారోహణం, గరుడ ప్రసాదం, యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ, హవణం, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహిస్తారు.
- 22న ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, గజవాహన సేవ, ఎదురుకోలు.
- 23న శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి వారి రథోత్సవం ఉంటుంది.
- 24న నిత్య పూర్ణాహుతి, అశ్వ వాహనసేవ, దీపోత్సవం.
- 25న మహా పూర్ణాహుతి, శ్రీ చక్ర స్నానం, సాయంత్రం హంస వాహన సేవ, పుష్పయాగం నిర్వహిస్తారు.
- 26న స్వామి వారి ఉత్సవానంతర స్థాపన, విశేష పూర్ణాభిషేకం ఉంటాయి.
Advertisement
ఇది కూడా చదవండి :పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్.. జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి ?
Advertisement