అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | ఎస్సారెస్పీ(SRSP)లో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు (Project)లో నీటిమట్టం 22.564 టీఎంసీలకు చేరింది.
యాసంగి పంటలకు సాగునీరు, తాగునీటికి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,447 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో(Inflow) వస్తుండగా, కాకతీయ కాలువ ద్వారా 5 వేలు, లక్ష్మి కెనాల్ ద్వారా 250, అలీసాగర్ లిఫ్ట్‌కు 540, గుత్ప ఎత్తిపోతలకు 405, టీఎస్‌ఐడీసీకి 312, సరస్వతి కెనాల్ ద్వారా 500, ఎస్‌ఎస్సీకి 100 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
ఆవిరి రూపంలో 510 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 230 క్యూసెక్కులతో కలిపి మొత్తం 7,848 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదవుతున్నట్లు డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. ఏప్రిల్ 9 వరకు యాసంగి పంటలకు మరో 12 టీఎంసీల నీటిని వదలనున్నారు. దీంతో ప్రాజెక్ట్‌లో 10 టీఎంసీల నీరు ఉంటుంది.