Bandi Sanjay | బీఆర్​ఎస్​ అధినేతపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay | బీఆర్​ఎస్​ అధినేతపై బండి సంచలన ఆరోపణలు
Bandi Sanjay | బీఆర్​ఎస్​ అధినేతపై బండి సంచలన ఆరోపణలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bandi Sanjay | బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ KCR, ఆయన​ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ Union Minister Bandi Sanjay సంచలన ఆరోపణలు allegations చేశారు. బీఆర్​ఎస్​ అధినేత కుటుంబం దొంగ నోట్లు ముద్రించేదని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.

Advertisement
Advertisement

గులాబీ నేతలకు బీదర్​లో దొంగ నోట్ల ప్రింటింగ్​ ప్రెస్​ fake notes printing press ఉండేదని వ్యాఖ్యానించారు. నాకు కూడా ఈ విషయం ఓ పోలీస్​ అధికారి చెబితే తెలిసిందన్నారు. బీదర్​లో Bidar ముద్రించిన దొంగ నోట్లను ఎన్నికల్లో elections పంచేవారన్నారు. ఎన్నికల సమయంలో వారు పంచినవన్నీ దొంగ నోట్లేనని ఆరోపించారు. దొంగనోట్ల దందా చేసిన ఆ కుటుంబం ప్రస్తుతం వేల కోట్లు సంపాదించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay | ప్రజల పరిస్థితి పేనం మీద నుంచి పోయిలో పడ్డట్లైంది

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్​ కుటుంబం KCR Family కబంధ హస్తాల నుంచి విడిపించుకోవాలని ప్రజలు బీఆర్ఎస్​ను ఓడించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకున్నారని.. అయితే బీజేపీకి BJP వేయాల్సిన ఓట్లు దారితప్పి కాంగ్రెస్​కు Congress వేశారన్నారు. దీంతో రాష్ట్ర ప్రజల State People పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యిందని వ్యాఖ్యానించారు. ‘న ఘర్​ కా.. న ఘాట్​ కా’ అన్నట్లు పరిస్థితి తయారైందన్నారు. కాంగ్రెస్​కు ఓటు Vote వేయడంతో ప్రజల బతుకులు ఆగమయ్యాయని పేర్కొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Supreme Court | ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా.. మరోసారి స్పీకర్​కు సుప్రీం నోటీసులు!

Bandi Sanjay | అప్పులు చెల్లిస్తూ.. హామీలు అమలు చేస్తామని చెప్పినా..

ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ పార్టీ Congress party అనేక హామీలు ఇచ్చిందని బండి సంజయ్​ Bandi Sanjay గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం BRS government రూ. 6 లక్షల కోట్ల అప్పులు చేసిందని.. అయినా వాటిని చెల్లిస్తూ హామీలు అమలు చేస్తామని చెప్పిందన్నారు. ఉద్యోగులకు employees డీఏలు, పీఆర్సీ, ప్రమోషన్లు ఇస్తామని, బకాయిలు చెల్లిస్తామని ప్రచారం చేసిందన్నారు. కానీ ఇవేవీ అమలు చేయలేదని విమర్శించారు.

రాష్ట్ర పరిస్థితి తెలిసినా హామీలు నెరవేరుస్తామని చెప్పి.. ఇప్పడేమో కేసీఆర్​ కుటుంబం KCR family చిప్ప చేతికి ఇచ్చిందని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏ ధైర్యంతో హామీలు నెరవేరుస్తామని చెప్పారని ప్రశ్నించారు ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement