అక్షరటుడే, వెబ్‌డెస్క్: Airlines | దేశంలో మరో మూడు కొత్త విమానయాన సంస్థలు new airlines ఏర్పాటు కానున్నాయి. ఈ సంవత్సరం నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.
శంఖ్ ఎయిర్ Shankh Air, ఎయిర్ కేరళ Air Kerala, అల్‌హింద్ ఎయిర్ Al Hind Air త్వరలోనే ప్రయాణికులకు సేవలందించేందుకు అందుబాటులోకి రానున్నాయి. కొన్నేళ్లుగా మన దేశంలో విమానయాన రంగం అద్భుతమైన రీతిలో వృద్ధి చెందుతున్నది. ఇప్పటికే 12 విమానయాన సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో రెండు సంస్థల వాటానే 90 శాతానికంటే ఎక్కువగా ఉన్నది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి passenger traffic అనుగుణంగా మరిన్ని సంస్థలు ఈ రంగంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో శంఖ్ ఎయిర్, ఎయిర్ కేరళ, ఆల్‌హింద్ ఎయిర్ కూడా త్వరలోనే విమాన సర్వీసులను నడపనున్నాయి. దేశంలో విస్తరిస్తున్న ఎయిర్‌పోర్టులుexpanding airports , పెరుగుతున్న విమాన ప్రయాణాలు.. మార్కెట్‌లో కొత్త వారికి విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం Noida Jewar International Airport నుంచి శంఖ్ ఎయిర్ Shankh Air కార్యకలాపాలు ప్రారంభించనుండగా, ఎయిర్ కేరళ, అల్‌హింద్ ఎయిర్‌ను కేరళ నిర్వహింనున్నది. దక్షిణాధి రాష్ట్రాల్లో southern states ప్రాంతీయ కనెక్టివిటీ, గల్ఫ్ దేశాలకు పెరిగే రద్దీ దృష్ట్యా కొత్త సంస్థలు పోటీ పడే అవకాశముంది. ఈ మూడు క్యారియర్లు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాయి. ప్రస్తుతం తుది ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ల (ఏవోసీ) Air Operator Certificates (AOCs) కోసం ఎదురు చూస్తున్నాయి. డీజీసీఏ నుంచి ఆ ధ్రువపత్రాలు రాగానే ప్రయాణికులకు సేవలందించనున్నాయి.
శంఖ్ ఎయిర్ ఉత్తరప్రదేశ్ Uttar Pradesh మొట్టమొదటి షెడ్యూల్డ్ పూర్తి స్థాయి సేవల విమానయాన సంస్థగా నోయిడా జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం Jewar International Airport నుంచి పని చేయనుంది. లక్నో, వారణాసి, గోరఖ్‌పూర్, ఢిల్లీ , ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు సర్వీసులు నడుపనున్నది. మార్చి చివరి నాటికి తన మొదటి నారో-బాడీ విమానాన్ని లీజుకు తీసుకోవాలని సదరు సంస్థ యోచిస్తోంది. రెండు విమానాలతో కార్యకలాపాలు ప్రారంభించి, ఒక సంవత్సరంలోపు ఐదుకు విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంటున్నది. 2027 నాటికి అంతర్జాతీయ విస్తరణ international expansion లక్ష్యంగా పెట్టుకున్నారు. సంస్థ చైర్మన్ శ్రావణ్ కుమార్ విశ్వకర్మ 50 మిలియన్ డాలర్లు కేటాయించగా, మాతృ సంస్థ శంఖ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 200 మిలియన్ డాలర్లు కేటాయించింది.
Airlines | ఎయిర్ కేరళ
ఈ సంవత్సరంలోనే దేశీయ కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి అతి తక్కువ-ధర క్యారియర్‌గా అవతరించాలని ఎయిర్ కేరళ Kerala లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో state government పాటు యూఏఈకి చెందిన జెట్‌ఫ్లై ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ పని చేయనుంది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మూడు ATR 72-600 విమానాలను నడుపనుంది.
కేరళలోని టైర్-2, -3 నగరాలను ప్రధాన కేంద్రాలతో అనుసంధానించడంపై దృష్టి సారిస్తుంది. కాలికట్ కేంద్రంగా ఉన్న అల్హింద్ గ్రూప్ టూర్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ అల్హింద్ ఎయిర్‌ను ప్రాంతీయ కమ్యూటర్ ఎయిర్‌లైన్‌గా ప్రారంభించనుంది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు ATR 72-600 విమానాలతో ప్రారంభించి, సంవత్సరంలోపు ఏడు విమానాలకు విస్తరించాలని భావిస్తోంది. రెండేళ్లలో గల్ఫ్ దేశాలకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.