అక్షరటుడే, వెబ్డెస్క్: సీనియర్ నేత డీఎస్ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. డీఎస్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని.. ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని.. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. కాగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.