అక్షరటుడే, కామారెడ్డి: SSC Exams | మాల్ ప్రాక్టీస్(mall practice)కు అవకాశం ఇవ్వకుండా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ.. పరీక్ష సమయానికి ముందే విద్యార్థులను నిశితంగా పరిశీలన చేసి కేంద్రంలోకి పంపించాలని, మాల్ ప్రాక్టీస్(mall practice)కు పాల్పడకుండా పరిశీలించాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, టాయిలెట్స్, మెడికల్ సదుపాయాలు, రవాణా వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ వెంకటరమణ, డిపార్ట్మెంట్ అధికారిణి మేరీవర్ధనం, కామారెడ్డి తహశీల్దార్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.