PF Withdrawals : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ మనీ విత్ డ్రా చేసుకోవచ్చు

PF Withdrawals : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ మనీ విత్ డ్రా చేసుకోవచ్చు
PF Withdrawals : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ మనీ విత్ డ్రా చేసుకోవచ్చు

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ PF Withdrawals : ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు (PF account) పీఎఫ్ ఖాతా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ప్రతి ఉద్యోగికి ఉంటుంది. ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం, కంపెనీ నుంచి 12 శాతం, రెండు కలిపి (PF account) పీఎఫ్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. ఈ పీఎఫ్ డబ్బులు (PF money) ఉద్యోగి రిటైర్ అయ్యాక వాళ్ల ఖర్చుల కోసమని ఇప్పటి నుంచే ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో కొంత అమౌంట్ జమ చేస్తుంటారు. అయితే.. పీఎఫ్ డబ్బులు (PF Withdrawals) విత్ డ్రా చేసుకోవాలంటే, పీఎఫ్ మనీని క్లెయిమ్ చేసుకోవాలంటే పీఎఫ్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement

పెన్షనర్లు కూడా ప్రతి నెలా ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, పెన్షనర్లు ఇక నుంచి పీఎఫ్ డబ్బులను ATM ఏటీఏం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. UPI యూపీఐ ద్వారా తమ బ్యాంక్ అకౌంట్ లోకి పంపించుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలను తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసిన సిఫారసును లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. వచ్చే జూన్ నుంచి పెన్షనర్లు తమ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే.. ఏటీఎం ద్వారా కేవలం ఒక లక్ష వరకు మాత్రమే (PF Withdrawals) విత్ డ్రా చేసుకోవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి :  Police crack the case | బాలుడి కిడ్నాప్, బండకేసి బాది దారుణ హత్య..కేసు ఛేదించిన పోలీసులు

PF Withdrawals : 95 శాతం క్లెయిమ్స్ ఆటోమేటెడ్

ఒకప్పుడు పీఎఫ్ విత్ డ్రా కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పీఎఫ్ విత్ డ్రా క్లెయిమ్స్ అన్నీ ఆటోమేటెడ్ అయ్యాయి. ప్రాసెస్ మరింత ఈజీ అయిపోయింది. అందుకే డిజిటల్ వ్యవస్థలో మరింత ముందడుగు వేస్తూ (PF Withdrawals) పీఎఫ్ విత్ డ్రాను యూపీఐ, ఏటీఎం ద్వారా కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో పీఎఫ్ విత్ డ్రా కోసం 120 వరకు డేటాబేస్ లను పీఎఫ్ డిపార్ట్ మెంట్ కనెక్ట్ చేసింది.

Advertisement