అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:SSC Exams | కంటి రెప్పలా కాపాడిన తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.. పరీక్ష కాలం మరో వైపు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన. అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అమ్మాయి పరీక్షకు హాజరైంది.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో చోటుచేసుకుంది. భిక్కనూరు(Bhikkanur) మండల కేంద్రానికి చెందిన విలేకరి సత్యనారాయణ గుండెపోటుతో మరణించారు. ఆయన కుమార్తె కీర్తన (Keerthana)ఈరోజు పదో తరగతి పరీక్ష రాసింది. నాన్న మృతి చెందిన బాధను దిగమింగుకొని కూతురు పరీక్ష రాయడం అందరిని కలిచివేసింది.