అక్షరటుడే, ఇందూరు: మాజీమంత్రి డీఎస్ మృతి పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. న్యాయవాదులు సోమవారం విధులకు దూరంగా ఉండాలని తీర్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. డీఎస్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. కార్యక్రమంలో స్టేట్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షుడు రాజు, లైబ్రరీ సెక్రెటరీ శ్రీకాంత్, సురేష్, అయూబ్, మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.