అక్షరటుడే, బాన్సువాడ: మోస్రా మండలం గోవూర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో సాయి కిరణ్(18) ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామానికి చెందిన సాయి కిరణ్ తన బంధువును పల్లె వెలుగు బస్సులో ఎక్కించి తిరిగి వెళ్తున్న సమయంలో బాన్సువాడ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడు మార్గమధ్యలో మృతి చెందాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.