అక్షరటుడే, ఇందూరు: జిల్లా పరిషత్‌ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్‌ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ శుక్రవారం జిల్లా పరిషత్‌ కు చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పి సీఈవో ఉష, పంచాయతీరాజ్‌ అధికారి శంకర్‌, ఇతర అధికారులు కలెక్టర్‌ కు స్వాగతం పలికారు.