GT vs RCB | బెంగళూరుపై గుజరాత్ ఘన విజయం

GT vs RCB | బెంగళూరుపై గుజరాత్ ఘన విజయం
GT vs RCB | బెంగళూరుపై గుజరాత్ ఘన విజయం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GT vs RCB : ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. బుధవారం చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో గెలిచింది.

Advertisement
Advertisement

బౌలింగ్ లో సిరాజ్ నిప్పులు చెరగగా..ఛేజింగ్ లో బట్లర్ (39 బంతుల్లో 73:5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (49) బ్యాటింగ్ లో రాణించారు. ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలు సాధించిన ఆర్సీబీ తొలి పరాజయం కూడా మూటగట్టుకుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Padi Kaushik Reddy : గుజ‌రాత్ ప్లేయ‌ర్స్‌తో పాడి కౌశిక్ రెడ్డి మీటింగ్.. వైర‌ల్ అవుతున్న వీడియో

మొదట బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి నిర్దేశిత పరుగులు చేసి గెలిచింది.

 

Advertisement