అక్షరటుడే, వెబ్డెస్క్ : SRH | సన్రైజర్స్ హైదరాబాద్, హెచ్సీఏ(HCA) మధ్య వివాదం ముదురుతుండడంపై ఆంధ్ర బోర్డు స్పందించింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేయాలని ఎస్ఆర్హెచ్(SRH)ను అక్కడి బోర్డు కోరింది. యాజమాన్యానికి సహకరిస్తామని వెల్లడించింది. కాగా హెచ్సీఏ(HCA) తమకు సహకరించడం లేదని, టికెట్ల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తోందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించిన విషయం తెలిసిందే.
ఉచిత పాస్లో కోసం హెచ్సీఏ అధ్యక్షుడు(HCA President) జగన్రావు(Jagan Rao) ఇబ్బంది పెడుతున్నారని ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ లేఖ రాశారు. గత సంవత్సరం నుంచి వారి తీరుతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. ఈ సమస్యను హెచ్సీఏ(HCA) దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదన్నారు.
దీనిపై సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో ఆంధ్ర బోర్డు వైజాగ్(Andhra Board Vizag)కు వచ్చేయాలని ఎస్ఆర్ హెచ్ ను కోరడం చర్చనీయాంశమైంది. మరి ఆ టీమ్(Team) ఎలా స్పందిస్తుందో చూడాలి.