Birth Control Pills : ఈ విషయం మీకు తెలుసా.. ఇప్పుడు పురుషుల‌కి గ‌ర్భ నిరోధ‌క పిల్స్

Birth Control Pills : ఈ విషయం మీకు తెలుసా.. ఇప్పుడు పురుషుల‌కి గ‌ర్భ నిరోధ‌క పిల్స్
Birth Control Pills : ఈ విషయం మీకు తెలుసా.. ఇప్పుడు పురుషుల‌కి గ‌ర్భ నిరోధ‌క పిల్స్

అక్షర టుడే, వెబ్ డెస్క్ Birth Control Pills : ఆడవారి (Ladies) మాదిరిగానే.. పురుషులకూ గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి వ‌స్తే బాగుంటుంద‌నే చ‌ర్చ ఎప్ప‌టి నుండో ఉంది. అలా చేయ‌డం ద్వారా ఆడ‌వారి (Ladies) పై కాస్త భారం త‌గ్గుతుంది. అయితే ఇప్పుడు అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్‌ హార్మోన్లకు (Testosterone hormones) అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్‌ను డెవ‌ల‌ప్ చేశారు. ఈ పిల్ హార్మోన్లలో మార్పులు చేసే సంప్రదాయ గర్భనిరోధక పద్ధతుల (Contraceptive methods) లాగా కాకుండా స్పెర్మ్‌ (వీర్యం) ఉత్పత్తిపై ప్రభావం చూపి గర్భ నిరోధకతగా పని చేస్తుంది. వైసీటీ- 529గా (YCT- 529) పిలుస్తున్న ఈ పిల్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటా కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, కొలంబియా యూనివర్సిటీ, యూవర్‌ ఛాయిస్‌ థెరప్యూటిక్స్‌ల సంయుక్తాధ్వర్యంలో అభివృద్ధి చేశారు.

Advertisement
Advertisement

Birth Control Pills : స‌క్సెస్ అయిన‌ట్టేనా..

ఇప్పటికే పురుషులపై మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ (Clinical Trails) విజయవంతంగా పూర్తయినట్టు తెలుస్తుండ‌గా, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ త్వరలో జరిగే అవకాశం ఉంది. ఈ మాత్ర తీసుకున్న 3 గంటలకు ప్రభావం మొదలై 24 గంటల వరకు పనిచేస్తుందని పరిశోధన వివరాల్లో పేర్కొన్నారు. కాగా, గర్భనిరోధక మాత్ర మగవారి శరీరంలో ఏ హార్మోన్‌నూ అణచివేయదని వెల్లడించింది. సాల్యూబుల్‌ అడెనైల్‌ సైక్లేస్‌ అనే ప్రొటీన్‌ వీర్య కణాలు వేగంగా గర్భాశయం వైపు ఈదేందుకు సాయపడుతుంది. అయితే, వెయిల్‌ కార్నెల్‌ మెడికల్‌ స్కూల్‌ అభివృద్ధి చేస్తు టన్న మాత్ర.. ఈ ప్రక్రియను నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది. పురుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించక ముందు మగ ఎలుకలపై వైసీటీ-529 డ్రగ్‌ను ప్రయోగించగా..

నాలుగు వారాల వ్యవధిలోనే స్పెర్మ్‌ కౌంట్‌ భారీగా తగ్గినట్టు తేలింది. ఈ పిల్‌ వాడకాన్ని ఆపేసిన ఆరు వారాల్లోగా ఎలుకలు మళ్లీ ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని పొందినట్టు పరిశోధకులు గుర్తించారు. దీని వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా లేవని చెప్పారు. వైసీటీ-529కు ఆమోదం లభిస్తే కొంతమేర అవాంఛనీయ గర్భధారణను అరికట్టే అవకాశం ఉంది. అంతేకాదు, దీని వల్ల మహిళలపై భారం తగ్గే ఆస్కారం ఉంది. పురుషులు సెకనుకు వెయ్యి వీర్య కణాలను ఉత్పత్తి చేస్తారు. గర్భాశయాన్ని ఫలదీకరణం చేయకుండా ఆపాలంటే.. మిలియన్ల సంఖ్యలో ఉండే వీర్య కణాలను Sperm నిరోధించేందుకు అవసరమైన వ్యూహం అమ‌లు చేయాలి. ఇప్పుడు అది స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తుంది.

Advertisement