అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడంతో పాటు, న్యాయమూర్తులు పారదర్శకంగా ఉండేలా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జడ్జీలు(Judges) తమ ఆస్తులను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) జడ్జి యశ్వంత్‌వర్మ(Yaswanth Varma) ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొలీజియం అత్యవసరంగా సమావేశమై ఆయనను అలహాబాద్ బదిలీ చేయాలని తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తులు పారదర్శకంగా ఉండేలా తమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీం స్పష్టం చేసింది.