Bird Flu | హైదరాబాద్​లో బర్డ్​ఫ్లూ కలకలం

Bird Flu | హైదరాబాద్​లో బర్డ్​ఫ్లూ కలకలం
Bird Flu | హైదరాబాద్​లో బర్డ్​ఫ్లూ కలకలం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bird Flu | హైదరాబాద్​(Hyderabad) శివారులో బర్డ్​ఫ్లూ కేసులు నమోదు కావడంతో చికెన్​ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బర్డ్​ ఫ్లూ వ్యాప్తి చెందడంతో చికెన్​ అమ్మకాలు తగ్గిపోయాయి. ప్రజలు చికెన్​ తినాలంటేనే భయపడ్డారు. ఇటీవల బర్డ్​ఫ్లూ భయం పోవడంతో మళ్లీ చికెన్​ తింటున్నారు.

Advertisement
Advertisement

ఈ తరుణంలో హైదరాబాద్​ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapoormet) మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అబ్దుల్లాపూర్​మెట్‌ పరిధిలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్​లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వాటి శాంపిల్స్​ను ల్యాబ్​కు పంపగా.. బర్డ్​ఫ్లూగా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ బర్డ్​ఫ్లూ వ్యాప్తి చెందుతుండటంతో పౌల్ట్రీ రైతులు, చికెన్​ సెంటర్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  GHMC | నేలపై పడుకుని బీజేపీ కార్పొరేటర్​ నిరసన