అక్షరటుడే ఆర్మూర్: Congress Armoor | భారతీయులను ఏకం చేయడమే ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ముఖ్య ఉద్దేశమని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 1, 2, 14వ వార్డులతో పాటు మండలంలోని గోవింద్పేట్లో గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ పాదయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ తిరుపతి, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, మాజీ వైస్ ఛైర్మన్ మోత్కూర్ లింగా గౌడ్, మాజీ కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత, డీసీసీ ఛైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ మారా చంద్రమోహన్, నాయకులు చిన్నారెడ్డి, గంగాధర్, నాయకులు బుల్లెట్ రమేష్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, జీవన్ రెడ్డి, రూపాల గంగాధర్, మార గంగారెడ్డి, అమృతరావ్ తదితరులు పాల్గొన్నారు.