Cabinet Expansion | మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు.. ఛాన్స్​ దక్కేదెవరికో..!

Cabinet Expansion | మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు.. ఛాన్స్​ దక్కేదెవరికో..!
Cabinet Expansion | మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు.. ఛాన్స్​ దక్కేదెవరికో..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cabinet Expansion | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ వీడడం లేదు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనేతలను కలిశారు. దీంతో నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయడానికి ఏఐసీసీ AICC గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్​ 3న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటికి మంత్రులు ఎవరనేది స్పష్టత లేదు. కాగా దీనిపై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. మంత్రివర్గంలో మైనారిటీలకు అవకాశం ఇస్తామన్నారు.

Advertisement
Advertisement

ప్రస్తుతం నాలుగు పదవులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎస్సీ కోటాలో వివేక్​ వెంటక స్వామి పేరు ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఆ వర్గం ఎమ్మెల్యేలు ఇటీవల డిమాండ్​ చేశారు. రెడ్డి కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి Komatireddy Rajagopal Reddy పదవి వచ్చే అవకాశం ఉంది. మరి మైనారిటీ కోటాలో minority quota ఒకరికి పదవి ఇస్తామని పీసీసీ చీఫ్​ చెప్పారు. దీంతో ఆ పదవి ఎవరికి వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy | రేపు గుజరాత్​కు సీఎం రేవంత్​రెడ్డి

మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ ఆమీర్​ అలీఖాన్​ MLC Aamir Ali Khan పేరు వినిపిస్తుంది. అలాగే అజారుద్దీన్​, ఫిరోజ్​ఖాన్​ సైతం పదవి ఆశిస్తున్నారు. కామారెడ్డికి చెందిన మాజీ మంత్రి షబ్బీర్​ అలీ Former minister Shabbir Ali మంత్రి పదవి ఆశించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు అవకాశం ఇస్తారని అంతా భావించారు. తీరా ఆయనను ఎమ్మెల్సీ చేయకపోవడంతో మంత్రి పదవి ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. అయితే మైనారిటీ కోటాలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని పీసీసీ చీఫ్​ చెప్పడంతో ఎవరికి ఇస్తారోననే చర్చ జరుగుతోంది.

Advertisement