అక్షరటుడే, వెబ్‌డెస్క్: High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊరట లభించింది. వర్మ విషయంలో ఇపుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.
Advertisement
తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సీఐడీ జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. వర్మపై తొందర పాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయనకు భారీ ఊరట కలిగింది.
Advertisement