IRCTC | రైలులో ఎంత లగేజీ తీసుకువెళ్లొచ్చో తెలుసా?

IRCTC | రైలులో ఎంత లగేజీ తీసుకువెళ్లొచ్చో తెలుసా?
IRCTC | రైలులో ఎంత లగేజీ తీసుకువెళ్లొచ్చో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: IRCTC | విమానాల్లో(Airplanes) ప్రయాణించే వారికి వెంట తీసుకువెళ్లే లగేజీ(Luggage)పై పరిమితి ఉంటుందని మనకు తెలుసు. అంతకు మించి ఎక్కువ బరువు గల సామగ్రి వెంట తీసుకెళ్తే అదనపు ఛార్జీ(Charges)లు చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే(Railway)లోనూ ఈ రూల్​ ఉంది. అయితే చాలా మందికి తెలియక ఎక్కువ మొత్తంలో లగేజీ తీసుకు వెళ్తుంటారు. 2025 సంవత్సరంలో రైల్వేశాఖ(Railways) ఒక వ్యక్తి తీసుకు వెళ్లాల్సిన లగేజీ పరిమితుల వివరాలను తాజాగా వెల్లడించింది.

Advertisement

ఏసీ ఫస్ట్​ క్లాస్​(AC First Class)లో ప్రయాణించే వ్యక్తి 70 కిలోల వరకు లగేజీ వెంట తీసుకు వెళ్లొచ్చు. ఏసీ 2 టైరులో 50 కిలోలు, త్రీ టైర్, స్లీపర్​లో 40 కేజీల చొప్పున, జనరల్​ టికెట్​(General ticket) కలిగిన వారు 35 కిలోల వరకు లగేజీ తీసుకు వెళ్లొచ్చు. అంతకు మించి సామగ్రి తీసుకు వెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించి బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రైల్వేశాఖ(Railways) భారీ జరిమానాలు వేస్తుంది. అంతేగాకుండా రైల్వేశాఖ నిషేధించిన వస్తువులను కూడా వెంట తీసుకు వెళ్లొద్దు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  IRCTC | అంబేడ్కర్​ యాత్రతో విశేషాలు తెలుసుకుందామా..