అక్షరటుడే, వెబ్డెస్క్: Waqf Bill | కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభ, రాజ్యసభలో Lok Sabha and Rajya Sabha ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వక్ఫ్ సవరణ బిల్లును తప్పుపట్టారు. వక్ఫ్ బోర్డు Waqf Board సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తమిళనాడు వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ విభజన రాజకీయాల కోసమే కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇది ముస్లింలపై మానసిక దాడిగా ఆయన అభివర్ణించారు.
Waqf Bill | వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన హీరో విజయ్
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement