అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన వ్యక్తికి తొమ్మిది నెలల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ కామారెడ్డి(Kamareddy) అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దీక్ష తీర్పు ఇచ్చారు. ఎస్పీ రాజేశ్ చంద్ర(SP Rajesh Chandra) తెలిపిన వివరాలు.. భిక్కనూరు మండల కేంద్రంలో అద్దెకు ఉంటున్న పోట్ల ముత్తాగౌడ్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బోయిని స్వామి ఆటోతో ఢీకొట్టాడు. ప్రమాదంలో గాయపడ్డ ముత్తాగౌడ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆటో డ్రైవర్ స్వామికి తొమ్మిది నెలల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Kamareddy | ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి 9 నెలల జైలుశిక్ష
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement