అక్షరటుడే, వెబ్‌డెస్క్: Europe | యూరప్ కంట్రీ రోడ్ల(europe roads)పై దశాబ్దం తర్వాత నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు కనబడవు. 2035 తర్వాత పెట్రోల్, డీజిల్ కార్లను (Petrol and diesel cars) నిషేధించబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరి నాటికి గ్రీన్ హౌస్ వాయు (greenhouse gas) ఉద్గారాలను 55శాతం మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశం.
ఈ ప్యాకేజీ ప్రకారం.. పెట్రోల్, డీజిల్(Petrol and diesel) ఆధారిత వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని 2030 నాటికి 55 శాతం తగ్గించాలి. 2035 నాటికల్లా వందశాతం లక్ష్యం చేరుకోవాలని యూరప్ భావిస్తోంది. ఇప్పుడు ఈయూ పార్లమెంట్, సభ్యత్వ దేశాలు ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. కాగా, యూరప్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది ఆసక్తిగా మారింది.