అక్షరటుడే, కామారెడ్డి: మొక్కలతోనే మానవాళి మనుగడ సాధ్యమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని యోగా భవన్ లో వన మహోత్సవం సందర్భంగా సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యోగా సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, యోగా సమితి సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.