అక్షరటుడే, వెబ్ డెస్క్: నీట్-2024 ను మళ్లీ నిర్వహించడమే చివరి ఆప్షన్ గా సుప్రీం కోర్టు పేర్కొంది. వైద్య ప్రవేశ పరీక్ష-2024 వివాదానికి సంబంధించిన అనేక అభ్యర్థనలను సోమవారం సుప్రీం విచారణ చేపట్టింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కేంద్రానికి సూచించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మొత్తం 38 పిటిషన్లపై విచారణ చేపట్టింది. కాగా.. పెద్దఎత్తున గోప్యత ఉల్లంఘించినట్లు రుజువు లేకుండా పరీక్షను రద్దు చేయడం వల్ల లక్షలాది మంది నిజాయితీ గల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని, కేంద్ర ప్రభుత్వం, నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీం కోర్టుకు తెలిపాయి. మొత్తం పరీక్షను రద్దు చేయడం వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఇది ప్రజా ప్రయోజనాలకు హానికరమని పేర్కొన్నాయి. వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణ ను ఈ నెల 11కు వాయిదా వేసింది.