అక్షరటుడే, వెబ్ డెస్క్: నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లకు జిల్లా స్థాయిలోనే బదిలీలు చేపట్టాలని ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నిరంజన్ రావు కోరారు. సోమవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకవేళ ఇతర జిల్లాలకు బదిలీ కోరుకుంటే ఆప్షన్స్ ఇచ్చి అవకాశం కల్పించాలన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ను కలిసి ఇదే విషయమై వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నిరంజన్, జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి తదితరులున్నారు.