Stock Market | మహాపతనంలోనూ మెరిసిన స్టాక్‌

Stock Market | మహాపతనంలోనూ మెరిసిన స్టాక్‌
Stock Market | మహాపతనంలోనూ మెరిసిన స్టాక్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఓవైపు ట్రేడ్‌వార్‌, రెసిషన్‌ భయాలతో దాదాపు అన్ని ప్రధాన కంపెనీలు సెల్లాఫ్‌కు గురవుతుండగా.. ఓ స్టాక్‌ మాత్రం ఇన్వెస్టర్లకు investors కాసుల పంట పండించింది. సోమవారం నాటి మహా పతనంలోనూ పది శాతానికిపైగా లాభాలను అందించింది. సీమెన్స్‌(Siemens) లిమిటెడ్‌ స్టాక్‌ సోమవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈ(NSE)లో రూ. 2,450 వద్ద ఓపెన్‌ అయ్యి పైపైకి ఎగబాకింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ కొట్టి రూ. 3,087 కి చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో కాస్త వెనక్కి తగ్గింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రూ. 2,805 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Advertisement

Stock Market | రెండు కంపెనీలుగా..

సీమెన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ తన వ్యాపారాన్ని సీమెన్స్‌ ఇండియా Siemens India, సీమెన్స్‌ ఎనర్జీ(Siemens Energy)లుగా విభజించింది. సీమెన్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఒక షేరు ఉన్నవారికి సీమెన్స్‌ ఎనర్జీలో ఒక షేరు కేటాయించారు. కొత్త కంపెనీ సీమెన్స్‌ ఎనర్జీ త్వరలో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో NSE and BSE లిస్ట్‌ కానుంది. దీనికి రెండునుంచి మూడు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 4వ తేదీలోగా సీమెన్స్‌ లిమిటెడ్‌ షేర్లు కలిగి ఉన్నవారికి త్వరలోనే సీమెన్స్‌ ఎనర్జీ షేర్లు యాడ్‌ కానున్నాయి. ఈమధ్య పూర్తి సీమెన్స్ ఇండియా షేర్లలో జోష్ కనిపించింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Stock market | ర్యాలీకి బ్రేక్‌..! నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ