అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HCU | హెచ్‌సీయూ(HCU) విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పోలీసులను ఆదేశించారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయడానికి యత్నించిన విషయం తెలిసిందే. అయితే ఆ భూములు హెచ్సీయూకు సంబంధించినవి అంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
సచివాలయం(Secretariat)లో హెచ్‌సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్‌తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం చర్చించారు. చర్చల అనంతరం విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.