అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ Government advisor Shabbir Ali విమర్శించారు. మాచారెడ్డిలో (MachaReddy) సోమవారం నిర్వహించిన జై బాపు జైభీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా Union Home Minister Amit Shah పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ.. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ Congress party దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అంబేద్కర్‌ను అవమానిస్తూ, రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రాజ్యాంగ పరిరక్షణతోనే దేశ మనుగడ సాధ్యమని, అందుకే గాంధేయ మార్గంలో గ్రామగ్రామాన పాదయాత్రలు చేపట్టి భారత రాజ్యాంగ విలువను చాటుతున్నామన్నారు.
Shabbir Ali | కొనుగోలు కేంద్రం ప్రారంభం..
అనంతరం మాచారెడ్డి ఏఎంసీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని షబ్బీర్ అలీ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ government కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.