అక్షర టుడే, వెబ్ డెస్క్ Demat account | మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ కొత్త డీమ్యాట్ ఖాతాలు (Demat Accounts) ప్రారంభించడం కూడా తగ్గిపోయింది. మొన్నటిదాకా స్టాక్ మార్కెట్ల (Stock Markets) వైపు కొత్త వారు పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యారు. దీంతో నెలనెలా కొత్త డీమ్యాట్ ఖాతాల (Demat Accounts) సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే, గత కొద్ది నెలలతో పోలిస్తే వీటి సంఖ్య తగ్గుముఖం పడుతుండడం మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతోంది. మార్చిలో కొత్త ఖాతాల ప్రారంభాల వేగం తగ్గింది. ఇది 23 నెలల్లోనే అతి తక్కువ కావడం గమనార్హం.
మొత్తం డీమ్యాట్ ఖాతాల (Demat Accounts) సంఖ్యలో స్థిరమైన పెరుగుదల ఉన్నప్పటికీ, డిపాజిటరీల నుంచి వచ్చిన డేటా కొత్త రిజిస్ట్రేషన్లలో గణనీయమైన మందగమనాన్ని సూచిస్తోంది. గత ఫిబ్రవరిలో 3.03 మిలియన్ల ఖాతాలు తెరవగా, మార్చి నెలలో 2.04 మిలియన్ కొత్త ఖాతాలు తెరిచారు. ఇది ఏప్రిల్ 2023 నాటి కంటే తక్కువ. వరుసగా మూడు నెలల నుంచి ఖాతాలు తెరవడం తగ్గిపోయింది. మొత్తంగా మార్చి నెలాఖరు నాటికి ఎన్‌ఎస్డీఎల్, సీడీఎస్ ఎల్‌లో కలిపి డీమ్యాట్ ఖాతాల (Demat Accounts) సంఖ్య 192.44 మిలియన్లు. ఇది గత ఫిబ్రవరిలో 190.4 మిలియన్లుగా ఉంది.
Demat account | తగ్గిన సెంటిమెంట్..
కొద్ది నెలలుగా ప్రపంచ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక వృద్ధి మందగించడం మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కల్లోలం రేపింది. ప్రతీకార సుంకాల పేరుతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చేందుకు రిటైల్ పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తున్నారు. ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఆర్థిక వృద్ధి అంచనాలు పెరిగితేనే మార్కెట్లలో సెంటిమెంట్ పెరుగుతుందని తద్వారా కొత్త ఇన్వెస్టర్లు మళ్లీ ఆసక్తి చూపుతారని నిపుణులు చెబుతున్నారు. ఐపీవోల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోవడంతో రిటైల్ పెట్టుబడిదారులు మార్కెట్ల వైపు చూడడం లేదు.