అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TRUMP | అణు ఒప్పందంపై ఇరాన్(Iran) ముందుకు రాకపోతే ఆ దేశానికి తీవ్ర ముప్పు తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమం గురించి శనివారం ఆ దేశంతో కీలక చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఇవి విఫలమైతే వారు పెద్ద ప్రమాదంలో పడతారని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు (Israel Prime Minister)తో భేటీ అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
TRUMP | బాంబుల మోత మోగిస్తాం..
ట్రంప్ ఇరాన్(Iran)ను నేరుగానే హెచ్చరించారు. ఒప్పందానికి రాకపోతే బాంబుల(Bomb) మోత మోగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ప్రత్యక్ష చర్చలు శనివారం ప్రారంభమవుతాయన్నారు. “టెహ్రాన్(Tehran) ఎప్పటికీ అణ్వాయుధాలను పొందలేదని” ఆయన అన్నారు. “మేము వారితో నేరుగా చర్చలు జరుపుతున్నాం. ఒప్పందం కుదిరే అవకాశముంది. ఒకవేళ ఒప్పందం కుదర్చుకోవడంలో వారు విఫలమైతే వారికే మంచిది కాదు. అక్కడ పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతాయని“ ట్రంప్(Trump) అన్నారు.
TRUMP | ఇజ్రాయెల్ మద్దతు
ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలకు ఇజ్రాయెల్(Israel) మద్దతు తెలిపింది. ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) మద్దతు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించాలనే ఇజ్రాయెల్, అమెరికాల ఉమ్మడి లక్ష్యమని ఆయన తెలిపారు. మరోవైపు, అమెరికా(America)తో జరుపుతున్న చర్చలపై ఇరాన్ ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా స్పందించింది. అమెరికాతో ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయని చెబుతూనే, అవి పరోక్షంగా ఉంటాయని తెలిపింది.