అక్షర టుడే, వెబ్ డెస్క్ Film Industry : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లకి (Betting apps) సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ (betting apps Promote) చేసేవాళ్లపై తెలంగాణ పోలీసులు (Telangana Police) చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు ఇంకా యాప్స్ ప్రమోషన్‌ను ఆపడం లేదు.
దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌ను (Betting apps) ప్రమోట్ చేస్తూ రూ.కోట్లలో సంపాదిస్తున్న వాళ్లు వేలాది మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేటీలే కాకుండా మరికొందరు బెట్టింగ్ టిప్స్ మాటున యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో సినీ ఇండస్ట్రీ (Film Industry) ఉలిక్కిపడింది. ఇప్పుడు మరో కేసుల భయం వారికి వణుకు పుట్టిస్తుంది.
Film Industry : గరం గరం..
“చూసీ చూడనట్టు వదిలిపెడుతుంటే మీరు హద్దులు దాటుతున్నారు. హెచ్‌సీయూ భూములతో (HCU lands) మీకేం సంబంధం.. మీ పని మీరు చూసుకోకుండా రాజకీయాల్లో వేలెందుకు పెడుతున్నారు, మీ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తారా” అంటూ తెలంగాణ ముఖ్యనేత సినిమా వాళ్లపై ఫైర్ అయినట్టు తెలుస్తుంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను కూల్చడం మీద సినీ ప్రముఖులు స్పందించటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తోలు తీస్తామంటూ హెచ్చరించినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సినీ ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న ఓ ప్రముఖ ప్రొడ్యూసర్‌కు ముఖ్యనేత ఫోన్ చేసి ఎడాపెడా దురుసుగా మాట్లాడినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
తెలుగు సినీ ప్రముఖులు (Telugu film celebrities) చాలా మంది ప్రభుత్వ దాష్టీకాన్ని నిరసించారు. ‘మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు?’ అని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూములను వెతకండి. ఒక తల్లిగా అడుక్కుంటున్నా. ఒకసారి ఆలోచించండి’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, నటి రేణూదేశాయ్ Renu Desai వీడియో రిలీజ్ చేశారు. మూగజీవాలను అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ మరో వీడియో రిలీజ్ చేసింది. అనసూయ, ప్రకాశ్ రాజ్, రవీనా టాండన్, దియా మీర్జా ఇలా చాలా మంది కూడా హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై వీడియోలు రిలీజ్ చేశారు. వారందరిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది.