MLC KAVITHA | ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్: కవిత

MLC KAVITHA | ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్
MLC KAVITHA | ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC KAVITHA | రాష్ట్రంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)​ కాదని.. ‘అనుముల ఇంటెలిజెన్స్​’(Anumula Intelligence) అని ఎమ్మెల్సీ కవిత (mlc Kavitha) ఆరోపించారు. హైదరాబాద్(Hyderabad)​లో పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్టంలో కేవలం ‘అనుమల ఇంటెలిజెన్స్​’ (Anumula Intelligence) మాత్రమే నడుస్తోందన్నారు. ఆయన పక్కకు తప్పుకుంటే తప్ప రాష్ట్రం(State) బాగుపడే సూచనలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

MLC KAVITHA | బీసీలకు అన్యాయం చేస్తున్నారు..

రేవంత్​రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy government) బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.  అనుముల ఇంటెలిజెన్స్​ను వాడుకుని కులగణనను తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్​సైట్(Website)​లో పెట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ధైర్యం లేదన్నారు. 2011లో యూపీఏ(UPA government) హయాంలో దేశంలో కులగణన చేసినా.. ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ(Telangana)లో చేసిన కులగణన వివరాలను కూడా వెల్లడించలేదన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  gig workers | గిగ్ వర్కర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

MLC KAVITHA | దొంగదీక్షలు బీఆర్​ఎస్​కు అలవాటు లేదు..

కాంగ్రెస్ నాయకుల్లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేసే అలవాటు బీఆర్​ఎస్​ నాయకులకు(BRS Leaders) లేదని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీకి(Delhi) వెళ్లి నిరవధికంగా దీక్షలో కూర్చుంటామని పేర్కొన్నారు.

MLC KAVITHA | బీజేపీని కాపాడేందుకే..

బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం(CM) అన్నారని.. కానీ ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు. బీజేపీ(BJP)తో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్(Prime Minister appointment) లభించేదని వివరించారు. బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని ఆరోపణలు గుప్పించారు. దానికి బదులు ఢిల్లీలో ఫేక్​ ధర్నా(Fake dharna) చేశారని ఎద్దేవా చేశారు.

Advertisement