అక్షర టుడే, వెబ్ డెస్క్ IPL 2025 : టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొన్నాళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. వన్డేలు, టెస్ట్‌లలో రోహిత్ (Rohit Sharma) దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒక మ్యాచ్ కాకపోయిన ఒక మ్యాచ్‌లో అయిన అద్భుత ప్రదర్శన కనబరుస్తాడు అనుకుంటే ప్రతి మ్యాచ్‌లో కూడా నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో (IPL 2025 season) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వైఫల్యం కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులే చేసి యశ్ దయాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
IPL 2025 : విమర్శల వర్షం..
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై భారీ షాట్లు ఆడిన రోహిత్.. టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ లెఫ్టార్మ్ పేసర్లపై తనకు ఉన్న బలహీనతను మరోసారి బయటపెట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో గాయంతో దూరమైన రోహిత్ శర్మ (Rohit Sharma) ఆర్సీబీతో (RCB) మ్యాచ్‌కి అందుబాటులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తాడని అందరు అనుకున్నారు. కాని మళ్లీ నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ (Rohit Sharma) 0, 8, 13, 17 పరుగులతో 38 పరుగులే చేశాడు. తాజా వైఫల్యంపై ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రకటించి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని హితవు పలుకుతున్నారు.
రోహిత్ శర్మ తప్పుకుంటేనే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్ play offs చేరుతుందని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మలో మునపటి సత్తా కనబడటం లేదని, అతను గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని కొందరు విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు. రోహిత్ పేలవ ఫామ్ గురించి తెలిసే ముంబై ఇండియన్స్ అతన్ని రిటైన్ చేసుకోలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రూ. 18 కోట్లకు తీసుకుంటే.. కోటికి 2.25 పరుగుల చొప్పున 38 పరుగులు చేశాడని సెటైర్లు పేల్చుతున్నారు. అభిమానులే కాకుండా మాజీ క్రికెటర్లు, ఐపీఎస్ అధికారులు కూడా రోహిత్ శర్మ వైఫల్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ సైతం.. రోహిత్ శర్మ ఎందుకు ఇంకా ఆటలో కొనసాగుతున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.