అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి Tamil Nadu Governor RN Ravi తీరుపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆమోదించి పంపించిన బిల్లులను తొక్కి పెట్టడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. బిల్లులు ఆమోదించకుండా పూర్తిగా తిరస్కరించజాలరని స్పష్టం చేసింది. గవర్నర్ రాజ్యాంగాన్ని పాటించాలని, రాజకీయ కారణాల ఆధారంగా వ్యవహరించకూడదని తేల్చి చెప్పింది. రాష్ట్ర అసెంబ్లీ state Assembly నిర్ణయాన్ని గౌరవించాలని కోర్టు పేర్కొంది.
గతంలో గవర్నర్ Governor తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపించినప్పటికీ.. వాటిని తొక్కిపెట్టడాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. రెండోసారి పంపించిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయా బిల్లులు ఆమోదించినట్లు కోర్టు ప్రకటించింది.
Supreme Court | తిప్పి పంపిన బిల్లులు ఆమోదించాల్సిందే..
తమిళనాడు అసెంబ్లీ Tamil Nadu Assembly పలు బిల్లులను ఆమోదించి గవర్నర్ వద్దకు పంపించింది. ఇందులో విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల vice-chancellors నియామకం సహా మిగతావి ఉన్నాయి. అయితే, వాటిని ఆమోదించని గవర్నర్ ఆయా బిల్లులను వెనక్కి పంపించారు. ప్రభుత్వం government మరోసారి బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్‌కు పంపించినప్పటికీ, ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో స్టాలిన్ cm stalin ప్రభుత్వం సుప్రీంకోర్టును Supreme Court ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగానే బిల్లులు ఆమోదించడం లేదని తెలిపింది.
Supreme Court | సంపూర్ణ వీటో లేదు..
గతంలో తిరిగి పంపిన తర్వాత అసెంబ్లీ మళ్ళీ ఆమోదించి పంపించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు Supreme Court పేర్కొంది. “రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలపాల్సిందే. బిల్లుపై సందేహాలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆమోదాన్ని తిరస్కరించవచ్చు. 10 బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయడానికి గవర్నర్ చర్య చట్టవిరుద్ధం. ఏకపక్షమని” న్యాయస్థానం తెలిపింది.
గవర్నర్ ఆమోదానికి పంపించిన తేదీ నుంచి 10 బిల్లులు ఆమోదించినట్లేనని జస్టిస్ జేబీ పార్థివాలా Justices JB Parthiwala, జస్టిస్ మహదేవన్‌లతో ustice Mahadevan కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని తెలిపింది. ఏ ఒక్కరికి రాజ్యాంగం సంపూర్ణ వీటో అధికారం అనుమతించమని పేర్కొంది. బిల్లును ఆమోదించడం లేదా నిలిపివేయడం లేదా రాష్ట్రపతికి పంపించడం.. ఈ మూడింటిలో గవర్నర్ ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. తప్పితే బిల్లులను తొక్కిపెడుతూ పాకెట్ వీటోను అమలు చేయలేరని తెలిపింది.
గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు Supreme Court కాల పరిమితులను నిర్ణయించింది. గవర్నర్ బిల్లును నెల రోజుల్లో ఆమోదించాలి. పునః పరిశీలనకోసం పంపించాలనుకుంటే మూడు నెలల్లోపే పూర్తి చేయాలి. రాష్ట్రపతికి పంపించాలనుకున్నా మూడు మాసాల్లో పూర్తి చేయాలని గడువు నిర్దేశించింది. గవర్నర్ ఈ కాల క్రమాన్ని పాటించకపోతే వారి నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయవచ్చని ధర్మాసనం సూచించింది. “రాజ్యాంగం ఎంత మంచిదైనా, అది చెడుగా మారడం ఖాయం. ఎందుకంటే దానిని పని చేయడానికి పిలిచిన వారు చెడ్డవారు అవుతారు. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా, దానిని పని చేయడానికి పిలిచిన వారు మంచివారు అయితే అది మంచిగా మారవచ్చు” అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.