అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM REvanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్, కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కాగా.. హెచ్‌సీయూ(HCU) భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఉన్నారని, రేవంత్‌రెడ్డిని బండి సంజయ్ కాపాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బండి మాట్లాడుతూ.. రేవంత్, కేటీఆర్ ప్రాణ స్నేహితులన్నారు. డీలిమిటేషన్(Delimitation)పై చెన్నై(Chennai)లో జరిగిన సమావేశానికి ఇద్దరు కలిసే వెళ్లారని, హైదరాబాద్(Hyderabad)లో కూడా మీటింగ్‌కు ఆ ఇద్దరు ప్లాన్ చేస్తున్నారని బండి అన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా సీఎం రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి ఎంఐఎం(MIM)ను గెలిపించడానికి సిద్ధం అయ్యారన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై సీబీఐ(CBI) విచారణకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.