అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ మండలంలోని మంగళూరు, నర్సింగ్‌రావు పల్లి, వెల్గనూరు, వడ్డేపల్లి, జక్కాపూర్, మల్లూరు గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) జైబాపు(Jai Bapu).. జైభీమ్(Jai Bheem).. జై సంవిధాన్(Jai Samvidhan) పేరిట రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా పిట్లం ఏఎంసీ ఛైర్మన్(Pitlam AMC Chairman) చీకోటి మనోజ్ కుమార్(Chikoti Manoj Kumar), పార్టీ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.