అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipality | ఆర్మూర్ పట్టణంలోని పలు హోటళ్లు(hotels), బేకరీలు(bakeries), మెస్(mess), జ్యూస్‌సెంటర్లలో(juice centers) మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీ(inspect)లు జరిపారు. మున్సిపల్ కమిషనర్ రాజు(Municipal Commissioner Raju) ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ గజానంద్(Sanitary Inspector Gajanand) తెలిపారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single-Use Plastic), పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించి, పలువురికి జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ఇంజనీర్ పూర్ణమౌళి(Engineer Poornamouli), మున్సిపల్ సిబ్బంది సంతోష్(Municipal Staff), అర్జున్, రాము పాల్గొన్నారు.