అక్షరటుడే, ఇందూరు: Transco Nizamabad | నగరంలోని అర్సపల్లి(Arsapalli) సబ్ స్టేషన్(Sub Station)లో అధిక సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్(Summer Action Plan)లో భాగంగా దీనిని ఏర్పాటు చేసినట్లు ఏడీఈ చంద్రశేఖర్(ADE Chandrasekhar) తెలిపారు.
మంగళవారం పాత 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్(MVA power transformer)ను తొలగించి నూతనంగా 12.5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను బిగించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్, డీఈ శ్రీనివాస్, డీఈ ఎంఆర్పీ వెంకటరమణ, ఏడీఈ తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.