traffic challans | నిబంధనలు ఉల్లంగించిన వారికి 1.19 లక్షల చలాన్లు వేశాం : ఎస్పీ రాజేష్ చంద్ర

traffic challans | 1.19 లక్షల చలాన్లు వేశాం : ఎస్పీ రాజేష్ చంద్ర
traffic challans | 1.19 లక్షల చలాన్లు వేశాం : ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: traffic challans | ట్రాఫిక్​ నిబంధనలు పాటించని వారికి చలాన్లు వేస్తున్నా తీరు మార్చుకోవడం లేదని ఎస్పీ రాజేష్​ చంద్ర SP Rajesh Chandra అన్నారు. జనవరి నుంచి మార్చి 31 వరకు జిల్లాలో వాహనాల తనిఖీలు Vehicle inspections చేపట్టి 1,19,606 చలాన్లు వేశామని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అయినా వాహనదారులు నిబంధనలు పాటించడం లేదన్నారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు strict action తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు traffic rules పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో మూడు నెలల్లో 105 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 58 మంది మరణించారని, 122 మంది గాయపడ్డారని వివరించారు. 3,026 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు drunk and drive cases నమోదు చేశామన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Sp Rajesh Chandra | పాత నేరస్తులపై నిఘా ఉంచాలి