అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఐదేళ్ల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదంటూ బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తాము ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె చేపడతామని కార్మికులు హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా నాయకుడు ఖలీల్, రాజు, సాయిలు, సలీం, సాయి తదితరులు పాల్గొన్నారు.