అక్షరటుడే, వెబ్డెస్క్: Ahmedabad | కాంగ్రెస్ పార్టీ Congress party సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్లోని Gujarat అహ్మదాబాద్లో Ahmedabad రెండు రోజులుగా ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశాలు AICC wide-ranging meetings జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులకు కీలక అధికారాలు అప్పగించారు. అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ అధ్యక్షులదే DCC presidents నిర్ణయమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే Congress national president Mallikarjun Kharge ప్రకటించారు. దీంతో జిల్లా అధ్యక్షులకు ఫుల్ పవర్స్ వచ్చినట్లయింది.
ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలతో పాటు, నామినేటేడ్ పోస్టులు, పార్టీ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు చెప్పిన వారికే అవకాశం ఇచ్చేవారు. జిల్లాల అధ్యక్షులు ఉన్నా వారికి అధికారాలు అంతంత మాత్రంగానే ఉండేవి. తాజాగా పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ ఈ డీసీసీ అధ్యక్షులకు పలు అధికారాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.