అక్షరటుడే, వెబ్డెస్క్ : Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub committee) ఈ నెల 12న సమావేశం కానుంది. ఉద్యోగుల జేఏసీ(Employees JAC) నాయకులు సోమవారం డిప్యూటీ సీఎం(Deputy CM) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులకు సంబంధించిన 57 సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందులో 45 సమస్యలు పరిష్కరిస్తే ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని చెప్పారు.
లోక్సభ ఎన్నికల సమయంలో బదిలీలు చేసిన ఎంపీడీవో(MPDO)లు, తహశీల్దార్ల(Tahaseeldar)ను పాత స్థానాల్లోకి మార్చాలని కోరారు. దీంతో ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి మేరకు ఈ 12న సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. మీటింగ్లో ఆయా సమస్యలపై చర్చిస్తామన్నారు.