అక్షరటుడే బిచ్కుంద: Job Mela | మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College)లో నిర్వహించిన జాబ్‌మేళాకు(Job Mela) విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్(College Principal Ashok) పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మేళాకు పెద్దఎత్తున విద్యార్థులు(Students) హాజరయ్యారని తెలిపారు.
ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ(MSN Pharma Company) ప్రతినిధులు మోహన్(Mohan), బ్రహ్మానంద రెడ్డి(Brahmananda Reddy) ఆధ్వర్యంలో సెలక్షన్స్(Selections) జరిగాయని.. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. ఎంఎస్ఎన్ (MSN)కంపెనీతో కళాశాల ఎంవోయూ(MOU) కుదర్చుకుందని తెలిపారు. కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్(IQ AC Coordinator) రమేశ్ బాబు, రసాయన శాస్త్ర అధ్యాపకులు సంతోష్, హన్మాండ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.