Alfrazolam | జోరుగా అల్ఫ్రాజోలం దందా

Alfrazolam | జోరుగా అల్ఫ్రాజోలం దందా
Alfrazolam | జోరుగా అల్ఫ్రాజోలం దందా

అక్షరటుడే, కామారెడ్డి : Alfrazolam | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో joint Nizamabad district అల్ఫ్రాజోలం Alfrazolam దందా జోరుగా సాగుతోంది. కల్తీ కల్లు తయారీ కోసం గుట్టుగా ఇతర ప్రాంతాల నుంచి అల్ఫ్రాజోలం తీసుకు వస్తున్నారు. అధికారుల కళ్లు గప్పి హైదరాబాద్ Hyderabad నుంచి తీసుకొచ్చి గుట్టుగా జిల్లాలోని పలు కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మత్తు పదార్థాల దందాపై ఎస్పీ సీరియస్​ ఉండటంతో ఇటీవల జుక్కల్​ ప్రాంతంలో Jukkal area వ్యాపారుల గుట్టు రట్టు అయింది. అయినా.. దందా మాత్రం ఆగడం లేదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారుల కళ్లు గప్పి కల్లు దుకాణాలకు toddy shops అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్నారు.

Advertisement

Alfrazolam | ధర తక్కువ.. మత్తు ఎక్కువ

జిల్లాలో అల్ఫ్రాజోలంతో Alfrazolam తయారు చేసిన కల్తీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కల్లుకు అలవాటు పడిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గతంలో ఈత, తాటి చెట్లకు కల్లు గీసి దాంట్లో చక్రీన్​ కలిపి అమ్మేవారు. అయితే ప్రస్తుతం ఈత, తాటి కల్లు దొరుకుతున్నా దాని రేటు ఎక్కువగా ఉంటుంది. సహజంగా లభించే కల్లు తక్కువగా ఉండటం.. తాగే వారు ఎక్కువగా ఉండటంతో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అందులోనూ మత్తు కోసం కల్లులో ఎక్కువ మోతాదులో అల్ఫ్రాజోలం వినియోగిస్తున్నారు. ఈ కల్లును జిల్లాలో సీసాకు రూ.10 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరలో ఎక్కువ మత్తు లభిస్తుండటంలో పలువురు దీనికి బానిసలుగా మారుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | అమాత్యా ఆలకించరూ.. జిల్లాలో అనేక సమస్యలు

Alfrazolam | రూ.కోట్లలో డిపోలకు టెండర్లు

ప్రతి దసరాకు Dussehra కల్లు ముస్తేదారులు toddy dealers మారుతుంటారు. ఏడాది పాటు డిపోల నిర్వహణ కోసం టెండర్లు వేస్తుంటారు. ఈ టెండర్లలో కొంతమంది గ్రూపుగా ఏర్పడి రూ.కోట్లకు టెండర్లు దక్కించుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని Kamareddy constituency ఓ డిపోకు ఏకంగా రూ.10 కోట్లకు టెండర్​ పాడినట్లు తెలిసింది. మరో డిపోకు రూ.1.5 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో టెండర్​ పాడిన వారు ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోవడానికి కల్తీ కల్లు జోరుగా విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా లాభార్జనే ధ్యేయంగా కృత్రిమ కల్లు అమ్ముతున్నారు.

Alfrazolam | చర్యలు కరువు

ప్రతి గ్రామంలో కల్తీ కల్లు విక్రయాలు సాగుతున్నా adulterated toffee.. ఇప్పటి వరకు ఎక్సైజ్​ అధికారులు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. దుకాణాల్లో ఏదైనా ఘటన జరిగినప్పుడే దాడులు చేసే అధికారులు మాములు సమయంలో అటువైపు వెళ్లడం లేదు. దాడి చేసిన సమయంలో సేకరించిన కల్లు శాంపిల్స్​లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా కల్తీ కల్లు అని తేలకపోవడం గమనార్హం. కల్లు డిపో నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకొని ఎక్సైజ్​ అధికారులు కల్తీ కల్లు గురించి పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement