అక్షరటుడే, ఎల్లారెడ్డి : water tanks | ఎండలు మండుతుండడంతో మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి suffering. తాగడానికి నీరు లేక విలవిల్లాడుతున్నాయి. మూగజీవాల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో villages ఏళ్ల కిందట నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. ఎండలు ముదరడంతో గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ponds and puddles సైతం నీటి జాడ కనిపించడం లేదు. దీంతో పశువులు దాహం తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి.
water tanks | వినియోగంలోకి తేవాలి
గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన నీటి తొట్లను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించి ఉపాధి హామీ పనుల్లో భాగంగా వాటికి మరమ్మతులు చేయిస్తే మూగజీవాలకు తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి అంటున్నారు.