China | వెనక్కు తగ్గని చైనా.. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధింపు

China | వెనక్కు తగ్గని చైనా.. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధింపు
China | వెనక్కు తగ్గని చైనా.. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: China | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో చైనా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఆ దేశంతో ఢీ అంటే ఢీ అంటున్నది. ట్రంప్ నిర్ణయాలకు Trump’s decisions దీటుగా సమాధానమిస్తూ తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నది. తాజాగా ట్రంప్ విధించిన 104 శాతం సుంకాలకు చైనా China దీటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతయ్యే అన్ని అమెరికన్ వస్తువులపై అదనంగా 84 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఉన్న 34 శాతానికి ఇది అదనం. గురువారం నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.

Advertisement

China | సుంకాల పోరులో తగ్గని డ్రాగన్

అమెరికా ప్రారంభించిన సుంకాల పోరులో ప్రపంచ దేశాలు ఆచితూచి స్పందిస్తుంటే చైనా China మాత్రం సవాల్ విసురుతోంది. గత వారం ప్రపంచ దేశాలపై టారిఫ్లు పెంచిన ట్రంప్ చైనాపై 34 శాతం సుంకం విధించారు. దీనికి డ్రాగన్ కూడా ధీటుగా స్పందించింది. తాము కూడా యూఎస్ వస్తువులపై US goods అంతే మొత్తంలో టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. చైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మరింత భారం వేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ దేశం తన నిర్ణయంపై స్థిరంగా నిలబడడంతో 104 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. డ్రాగన్ పునరాలోచనలో పడుతుందనుకున్న అమెరికా అధ్యక్షుడికి US president పరాభవమే మిగిలింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Gold price | మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఆదివారం ఇలా భ‌గ్గుమంది ఏంటి?

యూఎస్ మొదలుపెట్టిన సుంకాల యుద్ధాన్ని తిప్పికొడుతూ ఆ దేశం నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువలపై 84 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. శుక్రవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు computer chips and electric vehicle batteries వంటి హై-టెక్ ఉత్పత్తులలో high-tech products ఉపయోగించే మీడియం, హెవీ అరుదైన ఎగుమతులను నియంత్రిస్తామని బీజింగ్ కూడా చెప్పింది.

Advertisement