Indalwai | బీఆర్​ఎస్​ నాయకుడు డబ్బులు ఇవ్వడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం

Indalwai | బీఆర్​ఎస్​ నాయకుడు డబ్బులు ఇవ్వడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం
Indalwai | బీఆర్​ఎస్​ నాయకుడు డబ్బులు ఇవ్వడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం

అక్షరటుడే, ఇందల్వాయి : Indalwai | తన భూమి కొనుగోలు చేసిన బీఆర్​ఎస్​ నాయకుడు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఓ మహిళా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం తిర్మన్​పల్లి గ్రామానికి చిన్న సంధ్యారాణి తన భూమిని మూడేళ్ల క్రితం బీఆర్​ఎస్​ నాయకుడికి విక్రయించింది. కొంత డబ్బు చెల్లించిన ఆయన.. మిగతా డబ్బులు ఇవ్వడం లేదు. మూడేళ్లుగా డబ్బులు అడుగుతున్నా పట్టించుకోవడం లేదు.

Advertisement

ఈ క్రమంలో బుధవారం ఆయన ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నిలదీయగా ఆయనతో పాటు కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఈ మేరకు వారి ఇంటి ముందే సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ వీడియోను పలు గ్రూపులలో ఆమె పోస్ట్​ చేసింది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంధ్యారాణిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఈ విషయమై బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. బాధితురాలి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

Advertisement